తెలంగాణ

కాలుష్యానికి పాల్పడే పరిశ్రమలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: తెలంగాణ రాష్ట్రంలో జల, వాయు, భూమి కాలుష్యానికి పాల్పడే సంస్థలపై ఇక నుండి ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నివారణ మండలి మెంబర్ సెక్రటరీ అనిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, కాలుష్యానికి పాల్పడే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకునేందుకు కాలుష్య నివారణా మండలికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అవకాశం కల్పించిందన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల ఇచ్చిన తీర్పుతో కాలుష్య నివారణకు పాల్పడే కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర కాలుష్య నివారణ మండలి, రాష్ట్ర కాలుష్య నివారణా మండలికి అధికారం ఇచ్చిందని ఈ ప్రకటనలో తెలిపారు. ‘పొల్యూటర్ టు పే’ విధానం కింద కాలుష్యం చేసే కంపెనీలకు జుర్మానా విధిస్తామన్నారు. ఈ పరిస్థితిలో జల, వాయు, భూమి కాలుష్యానికి పాల్పడే కంపెనీలు వెంటనే కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలని అనిల్ కుమార్ సూచించారు.