తెలంగాణ

దోస్త్ రిపోర్టింగ్ గడువు రెండు రోజులు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు నిర్వహించిన ఆన్‌లైన్ కౌనె్సలింగ్ - దోస్త్ ద్వారా సీట్లు పొందిన వారికి ఆన్‌లైన్ రిపోర్టింగ్ గడువు పెంచినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చెప్పారు. 16, 17 తేదీల్లో దోస్త్ పోర్టల్ అందుబాటులో ఉంటుందని, సీట్లు పొందిన వారు ఆన్‌లైన్‌లో తమ కన్ఫర్మేషన్, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అభ్యర్ధులు రెండో దశ కోసం తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. సీట్లు పొందిన వారిలో చాలా మంది వాటిని కన్ఫర్మ్ చేసుకోలేదని , వారంతా తక్షణమే కన్ఫర్మ్ చేసుకోవాలని, లేకుంటే వారి సీట్లు రద్దవుతాయని చెప్పారు. సీట్లు పొందినట్టు సమాచారం తెలుసుకుంటున్నారే తప్ప కన్ఫర్మ్ చేసుకోవాలనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడం లేదని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగరాదనే ఉద్ధేశ్యంతోనే గడువు పెంచామని రెండో దశ సీట్ల కేటాయింపు 20వ తేదీన చేస్తామని పేర్కొన్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అభ్యర్ధులు తమ ఐడీ, పాస్‌వర్డుతో లాగిన్ కావాలని అందులో సీటు కన్ఫర్మేషన్‌కు ఆన్‌లైన్‌లో 500 లేదా 1000 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకోసం అభ్యర్థులు కాలేజీలకు వెళ్లనవసరం లేదని అన్నారు. ఆన్‌లైన్‌లో చెల్లించిన ఫీజును చిట్టచివరికి విద్యార్థి చేరే కాలేజీలో కట్టాల్సిన ఫీజుకు సర్దుబాటు చేస్తామని చెప్పారు. స్కాలర్‌షిప్‌నకు అర్హులైన అభ్యర్ధులు ప్రభుత్వ కాలేజీల్లో చేరితే ఆన్‌లైన్ రిపోర్టింగ్ ఫీజు కట్టనవసరం లేదని, అదే ప్రైవేటు కాలేజీల్లో సీటు పొందితే అటువంటి వారు 500 రూపాయిలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. స్కాలర్‌షిప్‌నకు అర్హత లేని వారు ప్రైవేటు కాలేజీల్లో చేరాలంటే 1000 రూపాయిలు చెల్లించాలని చెప్పారు.