తెలంగాణ

పెరుగుతున్న మిస్సింగ్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: తెలంగాణ రాష్ట్రంలో మిస్సింగ్ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పోలీసు వ్యవస్థ ప్రజల కోసం పనిచేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కోరారు. రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛను అణచివేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. సోషల్ మీడియాలో రాష్ట్రంలో కొద్ది రోజులుగా అదృశ్యమైన వారి పైన వచ్చే వార్తను పోస్ట్‌చేస్తే అక్రమ అరెస్టు చేస్తున్నారన్నారు. వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి పోలీసు వ్యవస్థపైన అపారమైన గౌరవం ఉందన్నారు.రాష్ట్రంలో 545 మంది మిస్సయితే, 318 మంది ఇంకా ఆచూకీ కనపడలేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై ఇలాంటి తప్పుడు కేసులు వెంటనే విత్ డ్రా చేయాలన్నారు. ప్రజల రక్షణకు పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థ ఈ రోజు కేవలం ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు రక్షణ కోసం మాత్రమే పని చేసే విధంగా ఉందన్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వేల సంఖ్యలో రాత్రి కూడా విధులు నిర్వహిస్తున్నారన్నారు. వారికి సరైన భద్రత కల్పించాలన్నారు. ప్రజల కోసం పోలీసులు పనిచేయాలన్నారు.

చిత్రం... మీడియాతో మాట్లాడుతున్న ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్