తెలంగాణ

స్వయం సహాయక బృందాలకు రూ. 6584.13 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలకు ఈ ఏడాది బ్యాంకులతో అనుసంధానం స్కీం కింద రూ.6584.13 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.
శనివారం ఇక్కడ ఆయన తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులతో అనుసంధానంపై జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం రూ.6048 లక్షల కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే, రూ.6148 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. ఇంతవరకు 42,68,398 కుటుంబాలను సంఘటితం చేసి, 4,11,847 స్వయం సహాయక సంఘాలుగా, 17,719 గ్రామ సంఘాలుగా, 543 మండల మహిళా సమాఖ్యలుగా, 30 జిల్లా సమాఖ్యలుగా ఏర్పాటు చేశామనన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత గత ఐదేళ్లలో బ్యాంకుల ద్వారా రూ. 27092.62 కోట్ల రుణాలను పంపిణీ చేశామన్నారు. గడచిన రెండున్నర దశాబ్ధాలుగా అంచలంచెలుగా ఎదిగి గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 382562 సంఘాలతో, రూ.9539.35 కోట్లతో స్వయం సహాయక సంఘాల బ్యాంకు రుణ నిల్వ చేరిందన్నారు. రాష్ట్రం అవతరించే నాటికి బ్యాంకు రుణం గ్రూపు ఒక్కింటికీ రూ.1.90 లక్షలతో ఉండగా, 2019 నాటికి రూ.3.90లక్షలకు చేరుకున్నట్లు చెప్పారు. సంఘాలు తీసుకున్న రుణాలను 75 శాతం తగ్గకుండా ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. ఇంతవరకు రాష్ట్రప్రభుత్వం రూ.2184 కోట్ల వడ్డీలేని రుణాల పథకం కింద విడుదల చేశామన్నారు. ఈ నెల నుంచి సెప్టెంబర్ వరకు రైతులకు సకాలంలో రుణాలు చెల్లించాలని ఆయన కోరారు. యూనిట్ విలువ ప్రకారం సరిపోయినంత రుణం ఇవ్వాలన్నారు. బ్యాంకు అనుసంధానాన్ని వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ ప్రథకాలు విజయవంతం కావడంలో బ్యాంకుల పాత్ర ఎంతో ఉందన్నారు. బ్యాంకు మేనేజర్లు వారికి లక్ష్యంగా సకాలంలో పూర్తి చేయాలన్నారు. బ్యాంకు లింకేజీ అమలులో ఉన్న సమస్యలను అధిగమించాలని ఆయన అధికారులను కోరారు.
*
చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు