తెలంగాణ

గవర్నర్‌ను మార్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను మార్చి ఆ స్థానంలో పుదుచ్ఛేరి గవర్నర్ కిరణ్‌బేడీని నియమించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంతరావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆంధ్ర, తెలంగాణకు ప్రస్తుతం చాలా సంవత్సరాలుగా ఒకే గవర్నర్ ఉన్నారన్నారు. ప్రస్తుత గవర్నర్ తన విధులను సక్రమంగా నిర్వహించలేకపోతున్నారన్నారు. ఇంటర్ బోర్డు వైఫల్యం వల్ల 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. హాజీపూర్‌లో ముగ్గురు యువతులు హంతకుడు శ్రీనివాస్ రెడ్డి చేతిలో బలయ్యారన్నారు. ఖమ్మంలో మిర్చి రైతులపై పోలీసులు దాడి చేశారన్నారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేశారన్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా, గవర్నర్ పట్టించుకోవడం లేదన్నారు. గవర్నర్ ప్రతిపక్ష పార్టీ నేతలు ఇచ్చిన వినతిపత్రాల్లో న్యాయబద్ధమైన డిమాండ్లను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తాము చేసిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గవర్నర్ ముఖ్యమంత్రికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు.