తెలంగాణ

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వాస్తవం చెప్పారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి నల్లగొండలో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని పేర్కొనడం వాస్తవమని ఆయన ఆహ్వానించారు. ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ఆయన చెప్పారన్నారు. దేశ, రాష్ట్రప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. శనివారం ఇక్కడ ఆయన నగరంలో సనత్‌నగర్ పరిధిలో పాదయాత్ర నిర్వహిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరేందుకు యువత ఉత్సాహాన్ని చూపిస్తోందన్నారు. తనను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్‌గోపాల్ రెడ్డి లాంటి నాయకులు అనేక మంది బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అందరినీ ఆహ్వానించి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. పాకిస్తాన్‌దేశం భారత్‌ను అస్థిరపరచాలని చేస్తున్న కుట్రలను తిప్పిగొడతామన్నారు. దేశ ప్రజలకు సరిగా తిండి పెట్టలేని పాక్ ప్రభుత్వం భారత్‌ను ఏదో చేస్తామని భ్రమపడుతోందన్నారు. అవసరమైతే పాక్‌కు మరోసారి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
చిత్రం...నగరంలో శనివారం పాదయాత్ర సందర్భంగా ప్రజలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి