తెలంగాణ

ఉత్తర తెలంగాణలో నేడు కూడా వడగాడ్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఆదివారం కూడా వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, సిర్సిల్లా, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. రాగల ఐదు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వివరించారు. గత 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్లియస్ భద్రాచలం, రామగుండంలో నమోదయ్యాయి. హైదరాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.