తెలంగాణ

భవన కార్మికులకు 5 వేల పింఛన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: తెలంగాణ రాష్ట్రంలో 60 సంవత్సరాలు నిండిన భవన కార్మికులకు నెలకు ఐదువేల రూపాయల పింఛన్ ఇవ్వాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తీర్మానించారు. సమావేశం వివరాలను మంత్రి మల్లారెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. కార్మిక శాఖకు సంబంధించిన కీలక అంశాలపై సూచనలు ఆమోదించారు. భవన కార్మికులందరికీ ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, ఒక్కొక్క కార్మికుడి కుటుంబానికి ఐదులక్షల రూపాయల వరకు విలువైన చికిత్స ఉచితంగా కల్పించాలని కోరారు. లేబర్ అడ్డాలవద్ద కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల ద్వారా అందే లబ్దిని మరింత పెంచాలని నిర్ణయించారు. సంక్షేమ బోర్డు ద్వారా అమలవుతున్న పథకాలను సమీక్షించి అవసరమైతే కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించామని మంత్రి వివరించారు. కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు.
ఈ సమావేశంలో మంత్రితో పాటు కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్, కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.