తెలంగాణ

వడదెబ్బతో ఐదుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, చిట్యాల, బెల్లంపల్లి, జడ్చర్ల, జూన్ 16: వర్షాకాలం సమీపించినా పలుచోట్ల వడగాలుల తీవ్రత తగ్గడం లేదు. రాష్ట్రంలో వడగాల్పుల బారిన పడి ఐదుగురు మృతి చెందారు. తీవ్రంగా కాస్తున్న ఎండలు, వీస్తున్న వడగాడ్పులతో ఒకే కుటుంబంలోఇద్దరు వృద్ధులు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పాత పోచారంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం పాత పోచారానికి చెందిన పసుపులేటి రామయ్య (80), పసుపులేటి క్రిష్ణయ్య (65) సోదరులు. గత వారం రోజులుగా వీస్తున్న ఎండలు, వడగాడ్పులతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వీరి ఇరువురిని స్థానిక వైద్యుడి వద్ద చికిత్స చేయిస్తుండగానే ఎండ తీవ్రతతో వాంతులు, విరోచనాలతో మృతి చెందారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని తాళ్ళవెళ్ళంల గ్రామంలో వడ దెబ్బతో కట్ట వెంకులు (70) అనే వృద్ధుడు వడదెబ్బతో మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీకి చెందిన కేంశెట్టి రమేష్ (35) అనే వ్యక్తి శనివారం రాత్రి వడదెబ్బతో మృతిచెందాడు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని మాచారం గ్రామంలో వ్యవసాయ పొలాల వద్ద తిరుగుతున్న 55 సంవత్సరాల వృద్ధురాలు వడదెబ్బ సోకి మృతి చెందింది.