తెలంగాణ

హాజీపూర్ బాధితులకు వీహెచ్ ఆర్థిక సహాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మలరామారం, జూన్ 16: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లకు ప్రజల ప్రయోజనాలకన్నా రాజకీయాలే ముఖ్యమయ్యాయని, ప్రచారం కోసమే హాజీపూర్ బాధిత కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని ట్విటర్లో కేటీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడమే దీనికి నిదర్మనమని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విహెచ్.హన్మంత్‌రావు విమర్శించారు. ఆదివారం హాజీపూర్‌కు విచ్చేసినఆయన తన జన్మదినాన్ని పురస్కరించుకుని సైకొ శ్రీనివాస్‌రెడ్డి హత్యాచారబాధిత శ్రావణి, మనీషా, కల్పన కుటుంబాలకు 10 వేల రూపాయల చొప్పున 30 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రీకొడుకులకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకన్నా రాజకీయాలే ఎక్కువయ్యాయని విమర్శించారు. ఎన్నికల అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి అన్నివిధాల ఆదుకుంటామని కేటీఆర్ ట్విటర్‌లో ఇచ్చిన హామీ ఏమయ్యిందని వీహెచ్ ప్రశ్నించారు. హత్యాచారానికి గురై రెండునెలలు గడుస్తున్నా ప్రభుత్వంనుండి నష్టపరిహారం చెల్లించడం మాట దేవుడెరుగు హాజీపూర్ గ్రామానికి అదనపు బస్సుసౌకర్యాన్ని కల్పించలేక పోయారని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్‌లు స్పందించి హాజీపూర్ గ్రామాన్ని సందర్శించి బాదిత కుటుంబాలకు 25 లక్షల వంతున నష్టపరిహారాన్ని అందజేసి ఆదుకోవాలని, అదేవిధంగా వారికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంతజరిగి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నా హాజీపూర్ గ్రామానికి రోడ్డుసౌకర్యాన్ని మెరుగుపర్చకపోవడం, శామీర్‌పేటవాగుపై వంతెన నిర్మాణం పనులు ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. వెంటనే నిధులు విడుదలచేసి హాజీపూర్ నుండి బొమ్మలరామారం వరకు బీటీరోడ్డు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్నారు. హాజీపూర్ గ్రామ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండి వారిలోనున్న భయాందోళనలను పారదోలేందుకు చర్యలు చేపట్టి తిరిగి హత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ సర్పంచ్ తిరుమల కవిత వెంకటేశ్, మాజీ సర్పంచ్‌లు ధీరావత్ శంకర్‌నాయక్, ఓరుగంటి రామస్వామిగౌడ్, హన్మంత్‌రావు మనుమలు అవినాష్, రోహిత్, అఖిల్, సచిన్, సుధతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.