తెలంగాణ

ఓపెన్ వర్శిటీ అర్హత పరీక్ష నిర్వహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: ఎలాంటి విద్యార్హత లేకుండా నేరుగా డిగ్రీలో చేరేందుకు అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ అర్హత పరీక్షను ఆదివారం నాడు ప్రశాంతంగా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 17,482 మంది ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. పరీక్షకు హాజరైన వారిలో 221 మంది జైలుశిక్షను అనుభవిస్తున్న వారూ ఉన్నారు. అందులో 197 మంది పురుషులు కాగా, 24 మంది మహిళలు ఉన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీ వెంకటయ్య, పీఆర్వో డాక్టర్ పీ వేణుగోపాల్‌రెడ్డి చర్లపల్లి సెంట్రల్ జైలులో పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు. డిప్యుటీ సూపరింటెండెంట్ సుమయ్య పర్యవేక్షణలో అర్హత పరీక్షను జైలులో నిర్వహించారు.