తెలంగాణ

మనిషి భావోద్వేగాలను వ్యక్తీకరించేదే కవిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: మనిషి భావోద్వేగాలను వ్యక్తీకరించే గొప్పకళ కవిత్వం అని ప్రముఖ కవి కే శివారెడ్డి పేర్కొన్నారు. కవిత్వం-2018 సంకలనాన్ని ఆవిష్కరించిన సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కవిత్వం జాతి జీవధార అని అన్నారు.
2018లో వివిధ పత్రికల్లో అచ్చయిన కొన్ని వందల కవితలను పరిశీలించి వాటిలో ఉత్తమమైన 60 కవితలతో ఈ సంకలనాన్ని దర్భశయనం రూపొందించారని అన్నారు. ఇది బృహత్తరమైన పని అంటూ ఈ సంపాదక కర్తవ్యాన్ని దర్బశయనం ఇష్టంగా గత 15 ఏళ్లుగా చేస్తున్నారని చెప్పారు. ఎన్నో శతాబ్దాల క్రితం ఆరంభమైన కవిత్వం మానవ జాతి మనగలిగేంత కాలం ఉంటుందని శివారెడ్డి అన్నారు. కవిత్వానికి కాలం చెల్లిందని ఎవరూ అనలేరని అన్నారు. మిగతా భారతీయ భాషలతో పోలిస్తే తెలుగు కవిత్వం ఎంతో ముందంజలో ఉందని అన్నారు. కవిత్వ సంకలనం సంపాదకుడు దర్భశయనం మాట్లాడుతూ వస్తుపరంగా తెలుగు కవిత్వం అద్భుతంగా ఉందని అభివ్యక్తి విషయంలో కవులు ఇంకా ఎక్కువ ధ్యాస పెట్టాలని పేర్కొన్నారు. సీనియర్ కవులతో పాటు కొత్త కవుల కవితలు కూడా ఈ సంకలనంలో చేర్చినట్టు చెప్పారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్న వరవరరావు, శివారెడ్డి లాంటి కవుల స్ఫూర్తితో కొత్త కవులు ఉత్తేజం పొందుతున్నారని , ఇదొక సుగుణమని అన్నారు. ఇలాంటి సంకలనాల వల్ల తెలుగు కవిత్వపు వివిధ పోకడలు, రీతులు రికార్డు అవుతాయని చెప్పారు. సాహిత్యకారులు వారాల ఆనంద్, యాకూబ్, రమణ జీవి, శిఖామణి, ప్రసాదమూర్తి, ఆశారాజు, రాము, రహమతుల్లా, దేశరాజు, విన్నకోట రవిశంకర్, ఆకాశవాణి రాంబాబు తదితరులు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 30 ఏళ్లుగా కవిత్వం రాస్తూ తనదైన ఒక ముద్ర రూపొందించుకున్న దర్భశయనం గత పదిహేనేళ్లుగా ఉత్తమ కవితలను సంపాదకుడిగా ఎంపిక చేసి సంకలనాలను వెలువరిస్తుండటం పట్ల ఆయన నిబద్దతను కవి వారాల ఆనంద్, యాకూబ్ తదితరులు అభినందించారు. కవిత్వం పట్ల ఇష్టం ఉన్న కవిగా ఆయన కృషిని పాల్గొన్న కవులు, సాహితీకారులు దర్భశయనం కృషిని కొనియాడారు.