తెలంగాణ

ప్రైవేట్ ఆసుపత్రులు సేవా భావంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: ప్రైవేట్ ఆసుపత్రులు సేవాభావంతో పనిచేయాలని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి కోరారు. ఆదివారం ఇక్కడ ఆయన సాధురాం కంటి ఆసుపత్రి నాల్గవ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో ఈ ఆసుపత్రి పనిచేస్తోందన్నారు. ఈ ఆసుపత్రి ఒక విజన్‌తో కంటి శిబిరాలను నిర్వహిస్తోందన్నారు. దక్షిణాదిలో సేవా భావంతో పనిచేస్తున్న కంటి ఆసుపత్రుల్లో సాధురాం ఒకటన్నారు. కేంద్రం పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ప్రజలు ఉత్సవాలు, ఇతర సమయాలో శాలువాలు, బోకేలు ఇచ్చే సంస్కృతిని మానుకోవాలన్నారు. దీని బదులు పాఠశాల పుస్తకాలు ఇస్తే పేద పిల్లలకు ఉపయోగపడుతాయన్నారు. ప్రతి ఒక్కరు సమాజ హితం కోసం పనిచేయాలన్నారు.