తెలంగాణ

ఉద్యోగులకు ఐఆర్ కూడా ప్రకటించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: లోటు బడ్జెట్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించగా మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణలో ఇంత వరకూ ఐఆర్ సైతం ప్రకటించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు చేసి ఏడాది పూర్తయినా ఇంత వరకూ వేతన సవరణ అతీగతీ లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ఉద్యోగులు న్యాయబద్ధమైన పీఆర్సీ కోసం గత ఏడాది సమ్మెకు దిగుతున్న సమయంలో మే 16న సీఎం కేసీఆర్ వారిని పిలిపించి చర్చలు జరిపారని, ఆ రోజు రాత్రి ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారని అన్నారు. పీఆర్సీకి ఒకే కమిషనర్‌ను వేస్తే నివేదిక ఆలస్యమలవుతుందని, త్వరగా నివేదిక ఇచ్చేందుకు ముగ్గురు సభ్యులతో కమిషన్ వేస్తామని , గత ఏడాది జూన్ 2న మధ్యంతర భృతి, ఆగస్టు 15న కొత్త పీఆర్సీ అమలుచేస్తామని మురిపించారు. కానీ వాగ్దానం చేసి ఏడాది గడచినా పీఆర్సీ ఇవ్వకపోగా, కనీసం మధ్యంతర భృతి ఇవ్వకుండా ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారని అన్నారు. సీఎం కేసీఆర్‌కు ఉద్యోగులంటే ఎలర్జీలా ఉందని, ఇచ్చిన మాట తప్పితే ఉద్యోగులు నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఉందని అన్నారు. తద్వారా పరిపాలన గాడి తప్పుతుందని, శాసనసభ ఎన్నికల్లో ప్రకటించిన రిటైర్మెంట్ వయస్సును 61 సంవత్సరాల పెంపు వాగ్దానం ఊసే లేకుండా పోయిందని, తక్షణమే ఐఆర్‌ను ప్రకటించి సాధ్యమైన త్వరలో పీఆర్సీ అమలులోకి వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, ఇచ్చిన మాట ప్రకారం రిటైర్మెంట్ వయస్సును 61 సంవత్సరాలకు పెంచాలని ఆయన డిమాండ్‌చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా గుర్తింపు పొంది, తర్వాత ఎంఎల్‌ఎ, ప్రస్తుతం మంత్రి అయిన వీ శ్రీనివాస్‌గౌడ్ పీఆర్‌సీ అంశంపై తక్షణం స్పందించాలని అన్నారు.
చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి