తెలంగాణ

భూ నిర్వాసితులకు పరిహారమివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: మల్లన్నసాగర్ ముంపు బాధితులకు చెల్లించిన ప్రకారమే వట్టెం (వెంకటాద్రి) రిజర్వాయిర్ ముంపు బాధితులకూ చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. అసైన్డ్ , ప్రభుత్వ భూములు సాగుచేస్తున్న వారికి కూడా పట్టాదారులకు చెల్లించిన విధంగానే పరిహారం ప్యాకేజీని ఇవ్వాలని అన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబానికి పునరావాస ప్యాకేజీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, 25 లక్షల విలువైన 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని, ముంపు తండాల్లోని ఇంటి స్థలానికి గజం 1600 రూపాయిలు చెల్లించాలని కోరారు. భూముల నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీ వన్‌టైం సెటిల్‌మెంట్‌గా ఒకేసారి చెల్లించాలని అన్నారు. 18 ఏళ్లు నిండిన అవివాహితుల కటాఫ్ తేదీని తాండాలను తరలించే నాటికి కటాఫ్ తేదీగా తీసుకోవాలని అన్నారు. అలాగే 19 ఏళ్లు నిండిన అవివాహితులకు 7.5 లక్షల రూపాయిల పునరావాస ప్యాకేజీ, 250 గజాల స్థలం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలని అన్నారు. ముంపు ప్రాంతాల్లోని ఇతర నిర్మాణాలు , పశువుల కొట్టాలు, బోరుబావులు, పైప్ లైన్లు, సమాధులు వంటి వాటికి కూడా పరిహారం ఇవ్వాలని వీరభద్రం కోరారు. నిర్వాసితుల ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని, ముంపు బాధితులకు పూర్తి పరిహారం, ప్యాకేజీని ప్రకటించిన తర్వాతనే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని అన్నారు. రిజర్వాయిర్ ఆయకట్టు కింద ఒక్కో నిర్వాసిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇవ్వాలని అన్నారు. కాగా తెలంగాణ రైతు సంఘం నేతలు పి జంగారెడ్డి, కార్యదర్శి టీ సాగర్‌లు వేరొక ప్రకటనలో పాలమూరు- రంగారెడ్డి భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని కోరారు.