తెలంగాణ

వైఎస్ విగ్రహాన్ని కూల్చుతామనలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ రెడ్డి విగ్రహాన్ని కూల్చుతామని తాము అన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ మాజీ ఎంపీ వీ హనుమంతరావు ఖండించారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పంజాగుట్ట సెంటర్‌లో ధర్నా చేశామన్నారు. ఆ సమయంలో పోలీసులు తమ వద్దకు వచ్చారని, వైఎస్ విగ్రహం ఉండగా, అంబేద్కర్ విగ్రహానికి అనుమతి ఎందుకు అనుమతి ఇవ్వరని అడిగానన్నారు. బుధవారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహా న్ని ఏర్పాటు చేయకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. వాస్తవానికి వైఎస్‌ను పీసీసీ అధ్యక్షుడిని చేసింది తానేనన్నారు. రాజ్యాంగంలో అంబేద్కర్ ఏర్పాటు చేసిన ఆర్టికల్ మూడు తోనే తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మర్చిపోరాదన్నారు. పోలీసులకు భయపడే ప్రసక్తిలేదని ఆయన స్పష్టం చేశారు.