తెలంగాణ

ఉద్యోగులకు న్యాయం చేయండి: దాసోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు ప్రభుత్వాన్నికోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న తాత్కాలిక భృతి గురించి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులకు కరవు భత్యాన్ని కూడా సకాలంలో ఇవ్వలేదన్నారు. దేశంలో 23 రాష్ట్రప్రభుత్వాలు ఉద్యోగుల వయోపరిమితిని 60సంవత్సరాలకు పెంచారన్నారు. 61 ఏళ్లకు వయోపరిమితి పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైందన్నారు. ఉద్యోగులకు ఆఫర్ చేసిన ఆరోగ్య బీమా పథకం పనిచేయడం లేదన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులు ఈ కార్డులను ఆమోదించడంలేదన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయన్నారు. కాని ఉద్యోగులకు సరైన సదుపాయాలు లేవన్నారు. ఉద్యోగుల సంఖ్యను పెంచాలన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తీవ్రంగా ఉందన్నారు. ప్రభుత్వ ఖాళీలపై శే్వతపత్రం ప్రకటించాలన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.