తెలంగాణ

ప్రజల తీర్పును గౌరవించని కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ ప్రజల తీర్పును ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవించుకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం కొత్త సచివాలయచం, అసెంబ్లీ నిర్మాణాలు అవసరం లేదన్నారు. రాష్ట్ర ఖజానాపై రూ.500 కోట్ల భారం ఎందుకని ఆయన అన్నారు. ఒక వైపు రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నిధుల కటకట తలెత్తుతుంటే, సచివాలయ భవనాలను కూల్చి కొత్త భవనాల నిర్మాణం ఎందుకన్నారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న శాసనసభను మార్చడానికి తాము వ్యతిరేకమన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల తర్వాత మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ప్రధాని నరేంద్రమోదీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. గత ఎన్నికల్లో తన కుమార్తె కవిత, బంధువు వినోద్ ఓడిపోవడంతో కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. సీఏం కేసీఆర్ ప్రతిపక్షపార్టీలను గౌరవించలేని స్థితిలో ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరిస్తుందని, దీనిని చూసి భరించలేక తోచినట్లు విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క రూపా యి ఇవ్వలేదనడం అన్యాయమన్నారు. పదవులకోసం రాజీపడిన చరిత్ర కేసీఆర్‌కు ఉందన్నారు. ప్రస్తుతం హరీష్‌రావు ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పిలవక పోవడం దురదృష్టకరమన్నారు. నిరుద్యోగం, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను, ఆర్టీసీని ఆదుకోవడానికి క్యాబినెట్‌లో కనీసం చర్చించలేదన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలన్న ఆకాంక్ష ముఖ్యమంత్రికి లేదన్నారు.