తెలంగాణ

కాళేశ్వరంతో చిగురించిన ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రేపు సీఎం కేసీఆర్ అట్టహాసంగా నిర్వహించనున్న క్రమంలో ఈ ప్రాజెక్టు పరిధిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు గోదావరి జలాలపై ఆశలు బలోపేతమయ్యాయి. 80వేల కోట్లకు పైగా వ్యయంతో 45 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో భాగమైన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్‌ల కింద 2 లక్షల 43 వేల ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొండపోచమ్మ సాగర్ నుండి కాళేశ్వరం కాలువల ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలోని గంధమల్ల రిజర్వాయర్‌ను, భువనగిరి నియోజకవర్గంలోని బస్వాపూర్ రిజర్వాయర్‌ను నింపనున్నారు. ఇందుకోసం ప్యాకేజీ 15, 16లలో గంధమల్ల రిజర్వాయర్‌ను 4.28 టీఎంసీల సామర్ధ్యంతో, బస్వాపూర్‌ను 11.5 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించనున్నారు. ఈ రెండు రిజర్వాయర్‌లకు కొండ పోచమ్మ సాగర్ నుండి గోదావరి నీళ్లందించేలా పనులు సాగుతున్నాయి. గంధమల్ల రిజర్వాయర్ కింద 63,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందనుంది. తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, యాదగిరిగుట్ట మండలాల ఆయకట్టు ఇందులో భాగంగా ఉండనుంది. నల్లగొండ జిల్లా చిట్యాల వరకు కాళేశ్వరం కాలువల కొనసాగనున్నాయి. బస్వాపూర్ రిజర్వాయర్ పరిధిలోని ఆలేరు, ఆత్మకూర్(ఎం), ఎం.తుర్కపల్లి, బీబీనగర్, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, వలిగొండ, రామన్నపేట, నారాయణపూర్ మండలాల గ్రామాలున్నాయి.
ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంతో..
సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ రెండో దశ 69,70,71 డిస్ట్రీబ్యూటరీ మెయిన్ కెనాల్స్ పరిధిలోని జిల్లా రైతులకు గోదావరి జలాలకు ప్రతి ఏటా ఎదురుచూపులే మిగులుతున్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఇక రైతులకు మంచిరోజులు రానున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 90 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంతో రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ జలాశయానికి ఎత్తిపోయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2017 ఆగస్టు 10న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన 2 వేల కోట్లతో చేపట్టనున్న ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశలో ఉన్న సూర్యాపేట జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు సమృద్ధిగా అందించేందుకు మార్గం ఏర్పడింది. 300 కోట్లతో పేట జిల్లాలో 22ఏళ్ల క్రితం చేపట్టిన ఎస్సారెస్పీ రెండో దశ కాలువల పనులు పూర్తికాకపోవడంతో పనుల పూర్తి, ఆధునీకరణకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది 220 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులన్నీ పూర్తయిన పక్షంలో ఆ కాలువలకు పునరుజ్జీవన పథకం ద్వారా సమృద్ధిగా నీళ్లందనున్నాయి. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల్లోని 72 కిలోమీటర్ల వెంట ఉన్న భూములకు రెండో దశ ద్వారా 25 టీఎంసీల నీళ్లు అందాల్సివున్నా ఏ సంవత్సరంలో కూడా రెండు టీఎంసీల నీళ్లు కూడా అందని దుస్థితి నెలకొంది. కాళేశ్వరం నుండి ఎస్సారెస్పీకి నీళ్లందడం ద్వారా రెండోదశలోని సూర్యాపేట జిల్లాకు గోదావరి జలాలు పరుగులు పెడతాయన్న ఆశలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.