తెలంగాణ

జడ్పీపీ, ఎంపీపీల తొలి సమావేశాలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీపీ, ఎంపీపీల తొలి సమావేశాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి పేరుతో నాలుగు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. మొదటి నోటిఫికేషన్ ప్రకారం జూలై 4 న ఎంపీపీల తొలి సమావేశాలు (ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని ఎంపీపీలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల ఎంపీపీ, నాగర్‌కర్నూలు ఎంపీపీ, మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బయ్యారం ఎంపీపీలు, ములుగు జిల్లాలోని వాజీడు, వెంకటాపురం, మంగపేట ఎంపీలు మినహా) ఆ యా మం డల ప్రజా పరిషత్ కార్యాలయం భవనాల్లో జరుగుతాయి. జూలై 4 న ఉదయం 11 గంటలకు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యులు, కో-ఆప్టెడ్ సభ్యుల చేత సంబంధిత అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ఎంపీపీలు, మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, బ య్యారం ఎంపీపీలు, ములుగు జిల్లాలోని వాజీడు, వెంకటాపురం ఎంపీపీలకు ఎన్నికైన సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షుల చేత ఆగస్టు 6న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ఇలా ఉండగా కొన్ని ఎంపీపీల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికలు ఇటీవల జరగలేదు. ఎన్నికలు జరగని ఈ ఎంపీపీలకు జూన్ 22 న ఎన్నికలు నిర్వహిస్తామని నాగిరెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా చిలిపిచేడ్, నిజామాబాద్ జిల్లా చండూరు, కామారెడ్డి జిల్లా దోమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి ఎంపీపీలకు అధ్యక్షుడు, ఉపాధ్యక్షడుడి ఎన్నికలు జూన్ 22 న నిర్వహిస్తామని నాగిరెడ్డి ప్రకటించారు. అలాగే కామారెడ్డి జిల్లా పిట్లం, నల్లగొండ జిల్లా పీఏ పల్లి, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, వరంగల్ (పట్టణ) జిల్లాలోని కమలాపూర్, జగిత్యాల ఎంపీపీలలకు ఉపాధ్యక్షులను ఎన్నుకునేందుకు జూన్ 21 న నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ మరురోజు అంటే జూన్ 22 న ఎన్నికలు నిర్వహిస్తామని నాగిరెడ్డి తెలిపారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జడ్పీపీలు మినహా మిగతా జడ్పీపీల తొలి సమావేశాలు జూలై 5 న నిర్వహిస్తారు. ఆరోజు ఉదయం 11 గంటలకు సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇలా ఉండగా ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జడ్పీపీల తొలి సమావేశాలు 2019 ఆగస్టు 7 న నిర్వహిస్తామంటూ ఆదేశాలు జారీ చేశారు.