తెలంగాణ

ఏపీ సీఎం జగన్‌ను చూసి కళ్లు తెరవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో రైతులు, బలహీనవర్గాల ప్రజల సంక్షేమానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. అనేక నెలల తర్వాత కేబినెట్ జరిగిందని, తమకు మంచి చేసే నిర్ణయాలు తీసకుంటారని ప్రజలు ఎదురుచూస్తే నిరాశ మిగిలిందన్నారు. బుధవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను చేసి రాష్ట్రప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. రుణమాఫీపై ఇంతవరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ఆగమ్యగోచరంలో ఉందన్నారు. రైతుల పంట రుణాలపై బ్యాంకర్ల వత్తిడి పెరిగిందన్నారు. బ్యాంకు రుణాల్లో రైతులకు ఇచ్చే 4 శాతం వడ్డీ రాయితీ సర్కార్ నిలిపివేవారన్నారు. ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఆర్భాటాలే తప్ప రైతులను ఆదుకుంటున్నది ఏమీ లేదన్నారు. సర్కార్ నిర్లక్ష వైఖరితో రైతులు ప్రైవేట్ ఆప్పుల బారిన పడుతున్నారన్నారు. ఉద్యోగుల తాత్కాలిక భృతిపైన, సీపీస్‌పైన, పీఆర్‌పీ, నిరుద్యోగభృతిపైన స్పష్టత ఇవ్వలేదన్నారు.
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..
గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ మాట్లాడుతూ తమ నాయకుడు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగారెడ్డి మాట్లాడు తూ రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. జన్మదిన వేడుకలు గాంధీభవన్‌లో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కేక్ కట్ చేశారు. స్కూలు పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు.
కాళేశ్వరంను తప్పుబట్టాల్సిన అవసరంలేదు:..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నామన్నారు. దీని వల్ల సంగారెడ్డి జిల్లా ప్రజల తాగునీటి కష్టాలు, రైతుల సాగునీటి సమస్యలు తీరుతాయన్నారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ప్రాజెక్టులు నిర్మించినా ప్రజలకు రైతుల కోసమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కాల్వలు తవ్వి సింగూరు, మంజీరాలను నింపాలన్నారు.