రాష్ట్రీయం

‘ఎర్ర’ దొంగల ఏరివేతకు ప్రత్యేక పిఎస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ జూన్ 26: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు స్టేషన్లను నెలకొల్పనున్నారు. తొలి దశలో తిరుపతిలో కపిలతీర్థం అటవీ భవన సముదాయంలో పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. 1967 ఏపి అటవీ సవరణ చట్టం ప్రకారం టాస్క్ఫోర్స్ పోలీసులకు స్మగ్లర్లను అరెస్టు చేయడం, కోర్టులో ప్రాసిక్యూషన్, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు నిర్వహించే అధికారాలు సంక్రమించాయి. 2015లో ఎర్రచందనం స్మగ్లర్ల కార్యకలాపాలను నిరోధించేందుకు రాష్ట్రప్రభుత్వం 450 మంది సుశిక్షితులైన పోలీసులతో టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకునే దిశలో టాస్క్ఫోర్స్‌కు అధికారాలు ఇచ్చారు. ఇప్పటికే శేషాచలం అడవుల్లో ఈ వృక్ష సంపదను పరిరక్షించేందుకు కందకాలు తవ్వుతున్నారు. స్మగ్లర్ల కదలికలను వీడియో ద్వారా పసిగట్టేందుకు ఆరు డ్రోన్లను కూడా కొనుగోలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో డ్రోన్ ఖరీదు రూ. 70 లక్షలు. శేషాచలం అడవుల్లో నిర్మించిన బేస్ క్యాంపుల నుంచి డ్రోన్లను వదులుతారు. అడవుల్లో సిసిటివి కెమెరాలను ఎక్కడ అమర్చాలన్న విషయమై కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం 19 సిసిటివి కెమెరాలను అమర్చారు. మరో 230 సిసిటివి కెమెరాలను అమర్చనున్నారు.
చైనాలో ఎర్రచందన విక్రయ కేంద్రం
చైనా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ దేశంలో ఎర్రచందనం విక్రయ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అవసరమైన అవకాశాలను పరిశీలించనున్నారు. రాష్టస్థ్రాయిలో ఎర్రచందనం సేకరణ, అమ్మకాలు, ఈ మొక్కల పెంపకం కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అటవీ శాఖ వద్ద ఆరువేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలన్నీ అక్రమరవాణా చేస్తున్న వారి నుంచి స్వాధీనం చేసుకున్నవే. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దశలో 2694 టన్నుల ఎర్రచందనం కలపను వేలం వేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.855 కోట్ల ఆదాయం వచ్చింది. నిరుడు రెండవ దశలో వేలం ద్వారా 830 మెట్రిక్ టన్నులను అమ్మితే రూ.178 కోట్ల ఆదాయం వచ్చింది. కేంద్రంలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శాఖ రాష్ట్రం నుంచి 8584 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఎగుమతికి అనుమతి ఇచ్చింది. ఇంతవరకు 3524 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని మాత్ర మే ప్రభుత్వం విక్రయించింది. ఆరువేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అటవీ శాఖ గిడ్డంగుల్లో ఉంది.

హైకోర్టు విభజనకు వెంటనే చర్యలు
కేంద్ర మంత్రికి బార్ కౌన్సిల్ వినతి

హైదరాబాద్, జూన్ 26: హైకోర్టు విభజన, న్యాయాధికారుల ఆప్షన్ల నిర్ణయం పట్ల వెంటనే జోక్యం చేసుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలంగాణ బార్ కౌన్సిల్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెణ్ రిజిజుకి వినతి పత్రం అందజేసింది. ఆదివారం బిజెపి కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి తదితరులు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజుని కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర విభజన అనంతరం హైకోర్టు విభజనకు వీలుగా భవనాలను గుర్తించాల్సిందిగా హైకోర్టు 2015 సంవత్సరం మే 1న ఆదేశించినా, ఎందుకో ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదని అన్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని పరిష్కరించాలని వారు కోరారు.