తెలంగాణ

సోనియాతో టి.నేతల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని తెలంగాణకు చెందిన ముగ్గురు సీనియర్ నాయకులు వేర్వేరుగా సమావేశమయ్యారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి, ఎఐసిసి నాయకుడు వి. హనుమంత రావు సోమవారం సోనియాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముగ్గురూ తెలంగాణలో పార్టీ స్థితిగతులపైనే చర్చించారు. సోనియాతో సుమారు గంట సేపు సమావేశమమైన జైపాల్‌రెడ్డి జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు జవసత్వాలు నింపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలని సోనియా గాంధీ భావిస్తున్న తరుణంలో జైపాల్ ఆమెతో సుదీర్ఘంగా మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ ఫిరాయించడం గురించి కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి సోనియా గాంధీతో కొంత సేపు చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొంత మంది గ్రూపులు కట్టి పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోని పక్షంలో పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధం అని సోనియాకు చెప్పానన్నారు. ఇలాఉండగా సిఎల్‌పి పదవి నుంచి కె. జానారెడ్డిని తొలగించాలని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా ఉన్న దిగ్విజయ్ సింగ్‌ను తప్పించాలని ఆయన సోనియాను కోరి ఉంటారని నాయకులు అనుకుంటున్నారు.
ఫిరాయింపుదారులను
అసహ్యించుకుంటున్నారు : విహెచ్
కాగా, వి.హనుమంత రావు సోనియాని కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించారు. ఫిరాయింపుదారులను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ వల్లే సాధ్యమైందని ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని ఆయన ఆమెకు వివరించారు.