తెలంగాణ

ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటాలకు సిద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిరక్షణకు బీజేపీ కార్యకర్తలు పోరాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేందుకు బీజేపీ అవిశ్రాంతంగా ఉద్యమిస్తుందని ఆయన చెప్పారు. ప్రజా సంక్షేమ విధానాలకు స్వస్తి చెప్పి కుటుంబపాలనను టీఆర్‌ఎస్ పార్టీ కొనసాగిస్తోందన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బలిదాన్ నివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్ముకాశ్మీర్ అంశంపై రాజీలేకుండా పోరాడిన గొప్ప యోధుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అన్నారు. దేశ సమగ్రతకు ప్రాణాలర్పించిన త్యాగశీలి అన్నారు. నెహ్రూ విదేశాంగ విధానాల్లో చోటు చేసుకున్న తప్పిదాల వల్ల కాశ్మీర్ సమస్య ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. 370 వ అధికరణ ముప్పు అని మొదటి నినదించిన నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ అన్నారు. ప్రస్తుతం కేంద్రం 370వ అధికరణ రద్దుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. భారతదేశానికి, కాశ్మీర్‌కు వేరువేరు రాజ్యాంగాలు వద్దని పోరాడారన్నారు. దేశంలో ప్రజలు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పట్ల అపారమైన విశ్వాసాన్ని ఓట్లు వేసి వ్యక్తం చేశారన్నారు. మోదీ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి వేగవంతమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ప్రణాళిక ఖరారు చేశామన్నారు. యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బలమైన ప్రత్యామ్నాయం బీజేపీ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి విజయరామారావు, ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
చిత్రం... శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బండారి దత్తాత్రేయ తదితరులు