తెలంగాణ

లక్ష ఉద్యోగాల హామీ ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల అంశాల ఆధారంగా నిర్మాణమైందని, లక్ష ఉద్యోగాల హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగలో తొక్కారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు బీజేపీ త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందన్నారు. అన్ని విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లు, లైబ్రరీలు, అమరవీరుల స్థూపాల వద్ద నిరసన కార్యక్రమాలు, సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఆదివారం ఇక్కడ కేసీఆర్ లక్ష ఉద్యోగాల హామీపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ నియామకాల విషయంలో తెలంగాణ యువత అన్యాయం ఎదుర్కొంటోందన్నారు. 1969 నుంచి 2014 వరకు జరిగిన ఉద్యమంలో అనేక మంది యువకులు బలయ్యారన్నారు. కాని కేసీఆర్ విధానాల వల్ల తెలంగాణలో యువత తీవ్రమైన నిరాశకు లోనైందన్నారు. 2015 మార్చి 10వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 1.12 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కోటి ఆశలతో పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు 25లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇంతవరకు కేవలం 25వేల ఉద్యోగాలను భర్తీ చేశారన్నారు. అందులో సగం పోలీసు డిపార్టుమెంట్‌కు సంబంధించినవేనన్నారు. అన్ని విభాగాల్లో దాదాపు 10 నుంచి 25 శాతం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఎనిమిదేళ్ల నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదన్నారు. ఐదేళ్ల నుంచి గ్రూప్ 3 నోటిఫికేషన్ లేదన్నారు. ఎనిమిదేళ్ల నుంచి డిఎస్సీ లేదన్నారు. ఏపీలో ప్రభుత్వం అన్ని విభాగాల్లో రెండుసార్లు నోటిఫికేషన్లు జారీ చేసిందన్నారు.
బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ జరగకపోవడం వల్ల వివిధ శాఖల్లో సిబ్బంది కొరత వల్ల రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందన్నారు. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు అందడం లేదనద్నారు. బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం తక్షణమే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. నిరుద్యోగులు తీవ్రమైన వత్తిడితో ఉన్నారన్నారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ వార్షిక క్యాలెండర్ ప్రకటించాలన్నారు. ఉద్యోగాల వివరాలపై శే్వతపత్రం ప్రకటించాలన్నారు. పరీక్ష రుసుములను రద్దు చేయాలన్నారు. మెరిట్ లిస్టు ప్రకటించేటప్పుడు పరీక్షలో, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను కూడా ప్రకటించాలన్నారు. నిరుద్యోగులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలన్నారు.
చిత్రం... కేసీఆర్ లక్ష ఉద్యోగాల హామీపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్