తెలంగాణ

దళితుల స్థలంలో తెరాస కార్యాలయమా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్,జూన్ 24: మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో అధికార తెలంగాణ రాష్టస్రమితి పార్టీ కార్యాలయం దళితుల భూమిలో నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం శంకుస్థాపన సందర్భంగా కొందరు నిరసనకు దిగారు. జడ్పీ చైర్‌పర్సన్ ఆంగోతు బిందు, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ తదితరులు హాజరైన ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మా భూములు మాకు కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చి కార్యక్రమం జరుగుతున్న చోటుకు వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మా భూమిలో తెరాస పార్టీ కార్యాలయం ఏంటని ప్రశ్నిస్తూ చేపూరి సునిత అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మహిళను అడ్డుకోవడంతో పాటు ఆందోళనకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు. సునితను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మిగతా వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ పిల్లి సుధాకర్, ఎమ్మార్పిఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గీళ్ల పీరయ్యలతోపాటు వివిధ దళిత సంఘాల నాయకులు ఏరియా ఆసుపత్రికి చేరుకొని సునితను పరామర్శించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మహబూబాబాద్ టౌన్ సీఐ రవికుమార్‌తో మాట్లాడి ఆందోళన కారులను బయటకు తీసుకువచ్చారు. ఈ చర్యను నిరసిస్తూ స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట మాల మహానాడు, కెవిపిఎస్, ఎమ్మార్పీఎస్ తదితర దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1973లోనే పట్టా పహాణిలో ఉన్న 30 గుంటల దళితుల భూమిని తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడం అటుంచి ఉన్న భూమిని లాక్కొని పార్టీ కార్యాలయాలు కడతారా? అని విమర్శించారు. దళితులకు న్యాయం జరగకపోతే తెరాస కార్యాలయాన్ని న్యాయపరంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ పిల్లి సుధాకర్, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గీళ్ల పీరయ్యలతో పాటు కేవీపీఎస్ నాయకులు కుర్ర మహేష్, యాకయ్య, తెలంగాణ మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు దబ్బెటి శ్రీనివాస్, రాష్టన్రాయకులు రమేష్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
రెండు గంటల పాటు హైడ్రామా
భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం భూమి పూజ ప్రక్రియ కార్యక్రమం నిరసనల మధ్య సోమవారం కొనసాగింది.
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమీప బంధువు చెల్పూరుకు చెందిన గండ్ర సత్యనారాయణరెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి గ్రామానికి చెందిన మిర్యాలపాపిరెడ్డి తమ వద్ద ఉన్న ఆధారాలతో టీఆర్‌ఎస్ కార్యాలయం కోసం భూమిపూజ చేస్తున్న స్థలం వద్ద ఆందోళనకు దిగారు. ముందుగానే కార్యాలయం కోసం ఎంపిక చేసిన స్థలంలో పెద్ద ఎత్తున లారీలను మోహరింపజేసి లారీ డ్రైవర్లతో భూమిపూజ చేస్తే పురుగుల మందు తాగుతామని హెచ్చరికలు చేశారు. దీంతో స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఒక్క రోజు ముందుగానే భూమిని పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రెవెన్యూ అధికారులతో మాట్లాడి 170 సర్వే నంబర్‌లో గల భూమిని ఎంపిక చేశారు. అదే స్థలంలో తమదని తెలిపే అన్ని ఆధారాలు ఉన్నాయని సత్యనారాయణరెడ్డి, పాపిరెడ్డి ఆందోళన చేపట్టారు. కావాలనే తమ భూమిని లాక్కోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ భూమి ప్రభుత్వ ఆదీనంలోనే ఉందని, రికార్డుల్లో ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవని వారిని ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. అనంతరం యధావిధిగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
ఎలాంటి వివాదం లేదు
టీఆర్‌ఎస్ కార్యాలయం నిర్మించనున్న స్థలం విషయంలో ఎలాంటి వివాదాలు లేవని, ఆ భూ సమస్యకు సంబంధించి కొంత పెండింగ్‌లో ఉందని ఆ విషయాన్ని రెవెన్యూ అధికారులు చూసుకుంటారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సోమవారం ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. అన్ని కోణాల్లోనూ వివరాలు సేకరించిన అనంతరం అధికారుల నిర్ణయమే శిరోధార్యమన్నారు.

చిత్రం... వివాదాస్పద స్థలంలో ఆందోళన చేస్తున్న దళిత సంఘాల నేతలు