తెలంగాణ

కేసీఆర్ పాలనపై పోరాటానికి సిద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: ప్రజాస్వామ్య తెలంగాణ సాధనకు, కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు, ప్రజా సంఘాలు పోరాటానికి సమాయత్తం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఇక్కడ పార్టీ కార్యాయలంలో దేశంలో ఎమర్జన్సీ విధించి 44 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ కొట్లాది సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాతరవేసిందన్నారు. ప్రశ్నించేవారిని నొక్కే విధంగా కేసీఆర్ వ్యవహరశైలి తయారైందన్నారు. ప్రజలను, పత్రికలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అన్నారు. అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య వాదులు బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జన్సీ పాలన కొనసాగుతోందన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మాదిరిగా కేసీఆర్ పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలనకు చెక్‌పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉందన్నారు. అలహాబాద్ హైకోర్టు తీర్పును పక్కనపెట్టి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఆ నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జన్సీ విధించారన్నారు. ప్రజాస్వామ్య విధానాలను అపహాస్యం చేసే విధంగా ఇందిరాగాంధీ పాలనకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో వేలాది మంది ఆరెస్సెస్ కార్యకర్తలు జైళ్లకు వెళ్లారన్నారు. దివంగత మాజీ ప్రధాని వాజపేయి, అద్వానీ, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ జైలు జీవితం గడిపారన్నారు. ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఆ రోజుల్లో దేశంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిర్బంధ కాండను అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.