తెలంగాణ

రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ అమలుచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను అమలుచేసేందుకు చొరవ తీసుకోవాలని ఏబీవీపీ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటనల్లో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల వల్ల ఇతర వర్గాలు నష్టపోకుండా 25 శాతం సీట్లను పెంచే విధంగా సీట్లను పెంచాలని ఏబీవీపీ నేతలు ప్రవీణ్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు అయ్యప్ప, రాఘవేందర్, శ్రీహరి, శ్రీశైలం కోరారు. తెలంగాణలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీల్లో 25 శాతం సీట్లు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాపై వత్తిడి తీసుకురావాలని అన్నారు. ఈ ఏడాది ఇప్పటికే వెలువరించిన ప్రకటనలను సమీక్షించాలని వారు కోరారు. కాగా, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ మంగళవారం నాడు ఏబీవీపీ నేతలు ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ కార్యదర్శి పి శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్రంలో అడ్డగోలుగా పెరుగుతున్న ఫీజులను నియంత్రించాలని, బీ కేటగిరి సీట్లను ఆన్‌లైన్‌లోనే భర్తీ చేయాలని, టీఎఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్‌ను నియమించాలని కోరారు.