తెలంగాణ

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు,కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని ఎఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ యూసుఫ్, అవుట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధానకార్యదర్శి మందా వెంకటేశ్వర్లు కోరారు. వీరంతా మంగళవారం నాడు తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఎఐటీయూసీ అధ్యక్షుడు కే ఏసురత్నం, ఉపాధ్యక్షుడు కే రవిచంద్రన్ తదితర నేతలు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో జూలై నెలలో నిరవధికంగా సమ్మెలోకి వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
డబుల్‌బెడ్‌రూం ఇళ్లు అడిగితే కేసులా?
డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టింనందుకు రేవిలే సైదులు అనే వ్యక్తిపై కేసు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు బీ ప్రసాద్, ప్రధానకార్యదర్ళి ఆర్ వెంకట్రాములు పేర్కొన్నారు.
కనీసం కనికరం లేకుండా పేదలపై కేసులు నమోదు చేయడం దారుణమని అన్నారు.
కల్తీ విత్తన వ్యాపారులపై చర్యలేవి?
నిషేధిత విత్తన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు పి జంగారెడ్డి, కార్యదర్శి టీ సాగర్‌లు కోరారు. నాణ్యత లేని విత్తనాల అమ్మకం ద్వారా రైతులను మోసగించడమేగాక, వేల కోట్ల రూపాయిల పెట్టుబడులు నష్టం జరిగేలా విత్తన వ్యాపారులు వ్యవహరిస్తున్నారని అన్నారు.