తెలంగాణ

కార్పొరేట్‌ల ఫీ‘జులుం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలుచేయకపోగా, ఫీజులను నియంత్రించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విద్యాశాఖాధికారులు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రావి శివరామకృష్ణ విమర్శించారు. గుర్తింపులేని కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ఫీజుల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని , నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విద్యాసంస్థలను సీజ్ చేయాలని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ప్రదర్శనగా విద్యార్థులు పాఠశాల విద్య సంచాలకుడి కార్యాలయాన్ని ముట్టడించారు. భారీగా చేరుకున్న పోలీసులు విద్యార్థి నేతలను అరెస్టు చేసి గాంధీనగర్, రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఎఐఎస్‌ఎఫ్ ప్రధానకార్యదర్శి శివరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎటువంటి గుర్తింపు లేకుండా లక్షలాది రూపాయిలు ఫీజులు దోపిడీ చేస్తున్నారని అయినా డీఈఓలూ, ఎంఈఓలూ పట్టించుకోవడం లేదని అన్నారు. మాదాపూర్ కేంద్రంగా గుర్తింపులేని కార్పొరేట్ విద్యాసంస్థలు నడుస్తున్నాయని అన్నారు. జీవో 90, జీవో 1లోని నిబంధనలను అమలు చేయాలని అన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని.. స్కూల్స్‌లో స్టేషనరీ పేరుతో వేలాది రూపాయిలు వసూలు చేస్తున్నా చర్యలు లేవన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వ అండదండలు ఉన్నాయని ఆరోపించారు.
చిత్రం...ఏఐఎస్‌ఐఎఫ్ నేతృత్వంలో స్కూల్ డైరెక్టరేట్‌ను ముట్టడించిన దృశ్యం