తెలంగాణ

నేటి నుంచి విత్తన పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: తెలంగాణ రాష్ట్రం మరొక ముఖ్యమైన అంతర్జాతీయ పండుగకు వేదిక అవుతోంది. గత ఐదేళ్లలో అనేక ప్రధానమైన సమావేశాలను, సదస్సులను నిర్వహించిన ఘనత తెలంగాణక దక్కింది. ఇప్పుడు 32 వ అంతర్జాతీయ విత్తన సదస్సు (ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్-ఇస్తా కాంగ్రెస్) బుధవారం నుండి ప్రారంభమవుతోంది. మాధాపూర్‌లోని హైటెక్స్, నోవాటెల్ హోటళ్లలో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
32 వ ఇస్తా కాంగ్రెస్ నిర్వాహణకు మూడేళ్ల క్రితమే నిర్ణయం జరిగింది. 31 వ ఇస్తా కాంగ్రెస్ సమావేశాలు యూరోప్‌లోని ఇస్టోనియా దేశ రాజధాని టాల్లిన్‌లో 2016 జూన్ 15 నుండి 21 వరకు జరిగాయి. తెలంగాణ నుండి 31 వ ఇస్తా కాంగ్రెస్ సమావేశాలకు వెళ్లిన విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు 32 వ ఇస్తా కాంగ్రెస్ సమావేశాలను తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిర్వహించాలని అప్పట్లో ప్రతిపాదించారు. అప్పటి వరకు ఆసియా ఖండంలోని ఏ దేశంలో కూడా ఇస్తా సమావేశాలు జరగలేదు. మొట్టమొదటిసారి ఆసియా ఖండంలోని భారత్‌లో అదీ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు 31 వ ఇస్తా సదస్సులో తీర్మానం చేశారు. దాంతో 32 వ ఇస్తా కాంగ్రెస్ సమావేశాల నిర్వహణకు మూడేళ్ల నుండి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. నియమావళి ప్రకారం మూడేళ్లకు ఒక సారి ఇస్తా అంతర్జాతీయ సమావేశాలు జరుగుతాయి. 2019 జూన్ 26 నుండి జూలై 3 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అంతర్జాతీయ విత్తన సమావేశాల పండుగ జరుగుతోంది. 70 దేశాల నుండి దాదాపు 400 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. భారత్‌లోని వివిధ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల నుండి 300 మంది శాస్తవ్రేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు.
కేంద్ర వ్యవసాయ మంత్రి ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. రాష్ట్రంలోని విత్తనోత్పత్తి రైతులను 1500 మందిని ఆహ్వానించి ఒకరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ రైతులకు అందించేందుకు ఈ ప్రత్యేక సమావేశం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన విత్తనోత్పత్తి సంస్థలు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు సంయుక్తంగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాయి. ఈ ఎగ్జిబిషన్ రైతులకు తోడ్పడాలన్న ఉద్దేశంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. విత్తనోత్పత్తికి సంబంధించి వివిధ స్థాయిలలో చర్చలు, ఇష్టాగోష్టులు జరుగుతున్నాయి.

అంతర్జాతీయంగా తెలంగాణ రెపరెపలు
విత్తన రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. ప్రపంచ మార్కెట్లోకి తెలంగాణ విత్తనాలు సులువుగా వెళ్లేందుకు ఈ సదస్సు దోహదపడుతుంది. ఆధునిక విత్తన సాంకేతిక పరిజ్ఞానం తెలంగాణ రైతులకు చేరేందుకు ఈ సదస్సు దోహదపడుతుంది. తెలంగాణ అంతర్జాతీయ విత్తన భాండాగాంగా మారాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష.
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి,
వ్యవసాయ మంత్రి, తెలంగాణ రాష్ట్రం.
ప్రతినిధులకు భద్రత
ఇస్తా సమావేశాలకు హాజరవుతున్న అంతర్జాతీయ, జాతీయ శాస్తవ్రేత్తలు, ఉన్నతాధికారులు, ప్రతినిధులకు భద్రతా చర్యలు తీసుకున్నాం. ఈ సమావేశాల్లో పాల్గొంటున్న వారందరికీ వసతి సౌకర్యాలు, భోజన సౌకర్యాలు కల్పించాం. శాస్తవేత్తలు ఈ సందర్భంగా విత్తనోత్పత్తికి సంబంధించిన పేపర్లను (నివేదికలను) సమర్పిస్తారు. ఎనిమిది రోజుల పాటు హైటెక్స్‌లో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది.
సి. పార్థసారథి,
వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి.