తెలంగాణ

యదాద్రి ఆలయ నిర్మాణం వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, జూన్ 25: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిర్మాణం పనుల్లో భాగంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రధానాలయం, గర్భాలయం, ప్రాకార మండపాలు, మాడ వీధుల గుండా డ్రైనేజీ పనులు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రధానాలయం సప్త రాజగోపురాలు, అష్ట్భుజ ప్రాకార మండపాలు పూర్తయిన నేపధ్యంలో వాటికి రాగి, ఇత్తడి తొడుగులు రూపొందించి వాటికి బంగారు పూత అద్దే దిశగా కసరత్తు చేస్తున్నారు. గర్భాలయ ద్వారం, ఆలయ ముఖ ద్వారం, ప్రధాన ద్వార తలుపులపై నగీషీలను సిద్ధం చేస్తున్నారు.