తెలంగాణ

మోడల్ స్కూల్‌లో వికటించిన అల్పాహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకరపట్నం, జూన్ 25: కరీంనగర్ జిల్లాలో విషాహారం తిని 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో 22 మంది విద్యార్థినులు మంగళవారం ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురై కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వసతి గృహంలో ఉండే విద్యార్థులు రోజు మాదిరిగానే సోమవారం రాత్రి ఆలుగడ్డ కూరతో భోజనం చేశారు. మంగళవారం ఉదయం అల్పాహారం ఉప్మాను తిని నీళ్లు తాగి పాఠశాలకు వెళ్లిన అనంతరం విద్యార్థులకు ఒకరి వెనుక ఒకరికి వాంతులు, విరోచనాలు కావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వారికి డాక్టర్ షాకీర్ అహ్మద్ వైద్యచికిత్స చేశారు. అయతే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో 108, పోలీసుల వాహనాల్లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు. కాగా, వసతి గృహంలో ఉండే వాటర్ ట్యాంక్‌ను గత కొంత కాలంగా శుభ్రం చేయకపోవడంతోనే విద్యార్థులు ఈ నీళ్లు తాగి అస్వస్థతకు గురయ్యారని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులతో పాటు వివిధ గ్రామాల నుండి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చి మోడల్ స్కూల్లో జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సంఘటనపై జిల్లా మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆరా తీసి సంఘటన వివరాలను పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు హుజూరాబాద్ ఆర్‌డిఓ చెన్నయ్యను మోడల్ స్కూల్‌కు పంపించారు. ఆర్‌డిఓ ఈ సంఘటనపై స్కూళ్లో పనిచేస్తున్న భోజన ఏజెన్సీ వారిని వివరాలు అడిగి తెలుసుకొని నీళ్లను, ఫాయిజన్ అయిన ఫుడ్‌ను శాంపిల్ తీసుకొని ల్యాబ్‌కు పంపిస్తామని, దీనిపై సమగ్ర విచారణ జరిపి జిల్లా అధికారులకు నివేదిక సమర్పించనున్నట్టు తెలిపారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులను జడ్పీటీసీ సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ సరోజనతో పాటు ఆర్‌ఐఓ సుహాసిని, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పరామర్శించారు.