తెలంగాణ

మాజీ నక్సలైట్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోనరావుపేట, జూన్ 27: కరీంనగర్ జిల్లా కోనరావుపేటలో సోమవారం ఇద్దరు మాజీ నక్సలైట్లను పోలీసుల అరెస్టు చేశారు. మండల కేంద్రం శివారులో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా, అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తుండగా ఎస్సై రాజ్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో పట్టుకుని, రెండు పిస్తోళ్ళు, ఏడు లైవ్ తూటాలు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరినీ స్టేషన్‌కు తరలించి విచారించగా, కోనరావుపేటకు చెందిన ముదాం ప్రసాద్, నిమ్మపెల్లికి చెందిన మానుక రాజుగా గుర్తించారు. వీరు గతంలో జనశక్తి గ్రూపులో నక్కలైట్లుగా పని చేసి, లొంగిపోయారు. అనంతరం అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యంతో ఆయుధాలు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ, బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. గత నెల మంచిర్యాలలో ఒక రియల్టర్ దగ్గరి నుండి బెదిరించి రూ.3 లక్షలు దండుకున్నారు. ఇదేవిధంగా కోనరావుపేట మండలంలో ఆయుధాలతో వెలుతూ బెదిరింపులకు గురి చేయడానికి వెలుతున్నట్టు సమాచారం రాగా వాహనాలు తనిఖీ చేసి, పట్టుకున్నట్టు తెలిపారు. ఈ సంఘటపై కేసు నమోదు చేసి, పట్టుబడిన ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.

చిత్రం పోలీసుల అదుపులో మాజీ నక్సలైట్లు