తెలంగాణ

తెరపైకి ‘2013’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 28: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్వాసితుల్లో రోజురోజుకూ గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. ఇదివరకు ఈ ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్ల నిర్మాణానికి 123 జిఓను తీసుకువచ్చి అందుకు సంబంధించిన భూమి కొనుగోలు ప్రక్రియను ఇప్పటికే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు పరిధిలో ఎదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తూ భూమి కొనుగోలు ప్రక్రియను చేపడుతోంది. ఓ పక్క 2013 భూసేకరణ చట్టం, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 123 జిఓలపై రైతులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్వాసితులకు అండగా నిలిచేందుకు కదులుతున్నారు. అందులో భాగంగా బుధవారం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ప్రతిపక్ష నేత జానారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించతలపెట్టిన కర్వెన రిజర్వాయర్ భూ నిర్వాసితులతో ముఖాముఖిగా భేటీ కానున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ మంగళవారం వెల్లడించారు. ఇప్పటికే పాలమూరు ఎత్తిపోతల పథకంలో అవినీతి జరుగుతోందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కోర్టుకు వెళ్లగా ఆయన ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని తెరాస నాయకులు ముకుమ్మడిగా నాగం దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఇందుకు ప్రతీకారంగా ప్రాజెక్టులో అవినీతిని మాత్రమే నాగం ప్రశ్నిస్తున్నారని బిజెపి కార్యకర్తలు ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసే కార్యక్రమాలకు దిగారు. ఇదిలాఉండగా కాంగ్రెస్ పెద్దలు కర్వెన రిజర్వాయర్ ముంపు బాధితుల దగ్గరకు రానున్నడం 2013 భూసేకరణ చట్టం ద్వారానే ప్రాజెక్టులకు భూములు ఇవ్వాలని రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో అధికార పార్టీ నాయకులు 123 జిఓనే శ్రేయస్కారం అంటుండగా ప్రతిపక్షాలు మాత్రం 2013 భూసేకరణ చట్టమే మేలంటున్నారు.
దీంతో పాలమూరు ఎత్తిపోతల పథకం ముంపు బాధితులు గందరగోళంలో పడ్డారు. వట్టెం రిజర్వాయర్ ముంపు బాధితులు మాత్రం పనులను అడ్డుకుని తమకు పరిహారం ఇచ్చాకే తమ పొలాల్లో యంత్రాలు పెట్టాలని డిమాండ్ చేస్తూ పనులను అడ్డుకుంటున్నారు.