తెలంగాణ

కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి భూసేకరణపై ప్రభుత్వ నిర్ణయంపై కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు మంగళవారం అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించింది. భూసేకరణకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం 2015లో జారీ చేసిన జీవో 75, 123, 190, 214ను సవాలు చేస్తూ ఎస్ ఉపేందర్ రెడ్డి మరో 14 మంది దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. రాష్ట్రప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి భూసేకరణకు పాల్పడుతోందని పిటిషనర్లు ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడ్వకేట్ జనరల్ కె రామకృష్ణా రెడ్డి వాదనలు వినిపిస్తూ రైతులకు ఉత్తమ నష్టపరిహారం ఇచ్చేందుకు ఈ జీవోలను ప్రభుత్వం జారీ చేసిందని పేర్కొన్నారు. రైతులను బలవంతం చేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదన్నారు. భూముల కొనుగోలు విధానాలకు సంబంధించి మాత్రమే ఈ జీవోలను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. రైతులు తమ భూములకు కావాల్సిన ధర అడిగే హక్కు ఉందని, అలాగే తిరస్కరించే హక్కు కూడా ఉందన్నారు. రైతులపై ఎటువంటి వత్తిడి తీసుకురావడం లేదన్నారు. ఈ సమయంలో హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుని ప్రభుత్వ విధానాలు, నిర్ణయాన్ని కౌంటర్ అఫిడవిట్‌గా దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది.