తెలంగాణ

రిటైరవుతున్న ప్రొఫెసర్లు.. ‘తాత్కాలికం’తోనే బోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో మరో నాలుగైదేళ్లు గడిస్తే ప్రొఫెసర్లే లేని పరిస్థితి ఏర్పడబోతోంది. సంప్రదాయ వర్శిటీల్లో అన్నింటిలో చాలా విభాగాలు ప్రొఫెసర్లు లేకుండానే నడుస్తున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లే అసోసియేట్ ప్రొఫెసర్లుగా వ్యవహరిస్తున్నారు. డీన్‌లుగా, హెడ్ ఆఫ్ ద డిపార్టుమెంట్‌గా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్లుగా సీనియర్ ప్రొఫెసర్లు ఉండాలనే నిబంధనలు ఉన్నా, చివరికి కొన్ని యూనివర్శిటీల్లో చాలా విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లే ఇన్‌ఛార్జిలుగా వ్యవహరిస్తున్నారు. మరికొన్ని విభాగాలు కాంట్రాక్టు టీచర్లే ఇన్‌చార్జిలుగా మారారు. దాంతో తాత్కాలిక సిబ్బందే ప్రశ్నాపత్రాల రూపకల్పన, వాల్యూయేషన్ ఇతర కీలక రంగాల్లో ముఖ్య భూమికను పోషిస్తున్నారు. పరిశోధనలకు సైతం ప్రొఫెసర్లు లేక కుంటుపడుతున్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్లు , అసిస్టెంట్ ప్రొఫెసర్లు సైతం పదోన్నతులు లేక రిటైర్ కావడంతో కొన్నాళ్లకు ప్రొఫెసర్ పదోన్నతులు కల్పించాలన్నా అభ్యర్ధులు లభించని దురవస్థ నెలకొంది. చాలా వర్శిటీల్లో సాంక్షన్ పోస్టుల్లోనే బోధన సిబ్బంది లేరు, చాలా వర్శిటీలకు వందలాది పోస్టులు అవుసరమైనా నేటికీ ప్రభుత్వం ఇంకా మంజూరు చేయలేదు, ఒక పక్క రిటైర్ కావడమే తప్ప మరో వైపు భర్తీ చేయకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. దాని ప్రభావం పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిపై పడుతోంది. ఉస్మానియా యూనివర్శిటీలో 1260 పోస్టులకు 470 మంది పనిచేస్తున్నారు. దాదాపు 800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇస్లామిక్ స్టడీస్, ఫిలాసఫీ, లింగ్విస్టిక్స్, ఉర్దూ, రష్యన్, ఫ్రెంచి, జర్మనీ, హిందీ, సంస్కృతం, ఆర్కియాలజీ, సోషియాలజీ వంటి విభాగాలు మూసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా వాటిలో ఒకొక్కరే పనిచేస్తున్నారు. మరో రెండు మూడు నెలల్లో మిగిలిన వారు కూడా రిటైర్ కానున్నారు. కాకతీయలో 390 మందికి 150 మంది మాత్రమే పనిచేస్తున్నారు. జేఎన్‌టీయూహెచ్‌లో 400 పోస్టులకు 180 మంది, ఫైన్ ఆర్ట్సు యూనివర్శిటీలో 57 పోస్టులకు 24 మంది పనిచేస్తున్నారు. మహాత్మాగాంధీ యూనివర్శిటీలో 17 డిపార్టుమెంట్లు ఉన్నా 150 పోస్టులకు 32 మంది పనిచేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీని ఘనంగా ప్రారంభించినా అక్కడ పాఠాలు చెప్పే రెగ్యులర్ సిబ్బంది కరువయ్యారు. శాతవాహన యూనివర్శిటీలో 20 మంది మాత్రమే పనిచేస్తున్నారు, పాలమూరు యూనివర్శిటీలోనూ అదే దురవస్థ నెలకొంది. రెగ్యులర్ టీచర్లు లేకపోవడంతో చాలా డిపార్టుమెంట్‌లు విద్యార్థులు లేరనే సాకుతో మూసేస్తున్నారు. యూనివర్శిటీల దురవస్థపై గత ఐదేళ్లుగా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నామని తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్సు అసోసియేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బీ సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డికి, కార్యదర్శి డాక్టర్ జనార్ధనరెడ్డికి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. నియామకాలు ఆర్ధిక భారంతో కూడుకున్నవి అయితే దానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుత టీచర్ల రిటైర్మెంట్ వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచాలని ఆయన పేర్కొన్నారు. యూనివర్శిటీలు నిలదొక్కుకోవాలంటే వయోపరిమితిని పెంచడం ఒక్కటే మార్గమని ఆయన చెప్పారు.
యూజీసీ సైతం వయోపరిమితి పెంపుపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని పేర్కొన్నారు.