తెలంగాణ

గవర్నర్‌ను కలిసిన అఖిలపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: తెలంగాణ అటవీ ప్రాంతల్లో పోడు భూముల వ్యవహారం ఇటీవల వివాదాలకు కేంద్రంగా మారింది. గిజనులు, గిరిజనేతరుల మధ్య పోడు భూముల వివాదం పరస్పర దాడులకు నిలయంగా మారిన సంగతి తెలిసిందే. పోడు భూముల వ్యవహారంలో ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలతో అఖిలపక్ష నేతలు బుధవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల కాగజ్‌నగర్ అటవీ పోడు భూముల వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే, అటవీ అధికారుల మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవల్లో అటవీ అధికారిపై ఎమ్మెల్యే తమ్ముడు కర్రలతో దాడులు చేయడంతో అధికారి తీవ్ర గాయాలకు గురయ్యాడు. గవర్నర్‌ను కలసిన అఖిలపక్ష నేతలు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర రెడ్డి, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
చిత్రం... గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తున్న అఖిలపక్షం నేతలు