తెలంగాణ

బాల నేరస్తుల్లో మార్పు తీసుకొస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: విద్యార్థులు ఏది మంచో, ఏది చెడో తెలుసుకుని మెలగాలని, జీవితమంతా సంతోషంగా గడపాలని స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జగదీశ్వర్ విజ్ఞప్తి చేశారు. బాలనేరస్తుల్లో మార్పు తీసుకువచ్చేందుకు పనిచేస్తున్న ‘అప్‌లిఫ్ట్ హ్యుమానిటీ’ సంస్థ ప్రతినిధులతో బుధవారం సచివాలయంలో ఆయన మాట్లాడారు. బాల నేరస్తుల్లో మార్పు తీసుకువచ్చేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. అప్‌లిఫ్ట్ హ్యుమానిటీ సంస్థ ప్రతినిధులు తెలంగాణలోని కొన్ని అనాథాశ్రమాలను దర్శించాలని సూచించారు. నేర ప్రవృత్తిలేని బాలబాలికల వల్లనే దేశం అభివృద్ధిపథం వైపు వెళుతుందన్నారు. తెలిసీ తెలియని పసివయస్సులో, యుక్తవయస్సులో చేసిన తప్పులకు శిక్షకు గురై ‘జువైనల్ హోం’లలో మగ్గుతున్న బాల నేరస్తుల మనస్సు మార్చేందుకు, వారిని నేరాల నుండి దూరం చేసేందుకు, సమాజంలో మంచిపౌరులుగా పేరుతెచ్చుకునేందుకు ‘అప్‌లిఫ్ట్ హ్యుమానిటీ’ సంస్థ పనిచేస్తోంది. అనీష్ పటేల్ ఈ సంస్థను స్థాపించారు. లాభాపేక్ష లేని ఈ స్వచ్ఛంద సేవా సంస్థకు అమెరికా కేంద్ర బిందువు. భారతదేశంలోని గుజరాత్, హైదరాబాద్‌లలో ఈ సంస్థకు ప్రతినిధులు ఉన్నారు. ఈ సంస్థ లక్ష్య సాధన కోసం అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్థులు (్భరత్‌కు చెందిన వీళ్ల తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడగా, ఈ పిల్లలు అమెరికాలోనే పుట్టి చదువుకుంటున్నారు) స్టీడీ టూర్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఉన్న జువైనల్ హోంను సందర్శించి బాలనేరస్తులకు వివిధ అంశాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యర్శి జగదీశ్వర్‌ను సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ పిఎల్ మూర్తి కూడా మాట్లాడారు. అమెరికా నుండి వచ్చిన యువ ప్రతినిధుల్లో అపర్ణ, కృతిక, లీనా, హిమానీ, బృంద, లయ, సింధు, శ్రేయ, తేజస్విని, రితిక, యశస్విని, మహిర్, రోనక్, రోషన్‌లు ఉన్నారు.
చిత్రం... అప్‌లిఫ్ట్ హ్యుమానిటీ సంస్థ ప్రతినిధులతో శిశు, సంక్షేమ ముఖ్యకార్యదర్శి జగదీశ్వర్