తెలంగాణ

విద్యార్థులకు న్యాయ విజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: విద్యార్థుల్లో న్యాయ విజ్ఞానంతో పాటు సామాజిక స్పృహ కల్పించే అంశాలపై ప్రత్యేక చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఎస్ స్వాతి రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా చింతల్‌బస్తీలోని రెడ్‌క్రాస్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించామని ప్రిన్సిపాల్ అనీలా అన్నారు. అక్రమ రవాణా, పాస్కో చట్టం, వరకట్న నిషేధ చట్టం గురించి విద్యార్థులకు వివరించడంతో పాటు వ్యాసరచన పోటీలు, చిత్రలేఖన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు, సర్ట్ఫికేట్లను ప్రదానం చేశారు. విద్యార్థులు పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారని ఆమె పేర్కొన్నారు.