తెలంగాణ

గోదావరి జలాల తరలింపుపై అఖిలపక్షంతో చర్చించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: గోదావరి జలాలను కృష్ణాకు తరలించే అంశంపై అఖిల పక్షంతో చర్చించాలని బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నదుల నీటిని తరలించడం సొంత వ్యవహారం కాదని, ఈ అంశంపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల సీఎంలు చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకవవడంలో తప్పులేదన్నారు. అయితే ఒక నది జలాలను మరో నదీ పరివాహానికి తరలింపు అంశంపై అఖిలపక్షంతో కూడా చర్చించాల్సిన అవసరం ఉందని సూచించారు. సచివాలయం, శాసనసభ భవనాలు ఉన్నప్పటికీ కొత్తగా మళ్లీ నిర్మించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. ప్రజాధనాన్ని వృధా చేయొద్దనేదే తమ ఉద్దేశమన్నారు. ఇదే విషయాన్ని తమ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేస్తే టీఆర్‌ఎస్ నాయకులు ఆయనపై ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారని పొంగులేటి ఖండించారు. బీజేపీ అంటే టీఆర్‌ఎస్‌కు భయం పట్టుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని ఆయన అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.