తెలంగాణ

కొత్త టీచర్లు వస్తున్నారు.. పాత టీచర్ల మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: కొత్త టీచర్ల రిక్రూట్‌మెంట్ జరుగుతోందని, కనుక పాత టీచర్లకు తక్షణమే పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని తెలంగాణ టీచర్సు ఫెడరేషన్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ విజయకుమార్‌నూ, కార్యదర్శి డాక్టర్ జనార్ధన్‌రెడ్డిని కోరింది. గత నాలుగు సంవత్సరాలుగా వివిధ కేడర్లలో అన్ని రకాల అర్హతలున్నా చాలా మంది ఉపాధ్యాయులు పదోన్నతులకు నోచుకోలేదని మరో పక్క సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని టీటీఎఫ్ అధ్యక్షుడు ఈ రఘునందన్ , ప్రధానకార్యదర్శి కే రమణ పేర్కొన్నారు. దాదాపు 20 ఏళ్లు సర్వీసున్న ఎస్‌జీటీ లు పదోన్నతులు లేక రిటైర్ అవుతున్నారని అదే విధంగా స్కూల్ అసిస్టెంట్‌గా ఉన్న సీనియర్ టీచర్లు కూడా హెడ్మాస్టర్ పదోన్నతి పొందకుండానే రిటైరవుతున్నారని అన్నారు. తక్షణమే ఎస్‌జీటీలకు , స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని అన్నారు. అదే విధంగా అర్హతలున్న స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించాలని కోరారు. పదోన్నతుల విషయంలో న్యాయపరమైన వివాదాలు పరిష్కరించి పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కమిషనర్ చెప్పారని రఘునందన్ పేర్కొన్నారు.