తెలంగాణ

మున్సి‘పోల్’కు సిద్ధం కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల పాలక మండళ్లకు ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల కమిషనర్లకు ఎన్నికల నిర్వహణ, విధాన నిర్ణయాలపై ఒక రోజు శిక్షణ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా సగం మంది కమిషనర్లకు బుధవారం శిక్షణ ఇచ్చారు. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణా కార్యక్రమం జరిగింది. మిగతా సగం మంది కమిషనర్లకు ఈ నెల 12 న శిక్షణ ఇస్తారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే ఓటర్ల జాబితా రూపొందించామని, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై అధ్యయనం జరిగిందని గుర్తు చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్లు, వార్డు కౌన్సిలర్ల స్థానాలకు ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు రిజర్వేషన్ల ప్రక్రియ నడుస్తోందని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. రిజర్వేషన్ల విషయంలోనూ, పోలింగ్ కేంద్రాల ఎంపికలోనూ ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి త్వరలోనే జిల్లాస్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా రాజకీయ వత్తిళ్లకు గురికావద్దని, నియమావళి ప్రకారమే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రిజర్వేషన్లకు సంబంధించి ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రిజర్వేషన్ల ఖరారు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాము ఎప్పటికప్పుడు సర్క్యులర్లను, ఆదేశాలను జారీ చేస్తుంటామని, వీటిని తు.చ తప్పకుండా అమలు చేయాలని కోరారు. వివిధ సందర్భాలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమావేశాల్లో వారు చెప్పే అంశాలన్నింటినీ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలని, నియమావళికి అనుగుణంగా వాటిపై నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
ఏవైనా అంశాలపై సమస్య వస్తే జిల్లా కలెక్టర్లతో మాట్లాడాలని, అవసరమైతే తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... మున్సిపల్ కమిషనర్ల శిక్షణా కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి