తెలంగాణ

వృద్ధుల, మానసిక వికలాంగుల హక్కులను కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: వృద్ధులకు, మానసిక వికలాంగులకు హక్కులున్నాయని, వీటి గురించి స్వచ్ఛంద సేవా సంస్థలు అధ్యయనం చేయాలని మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటి కార్యదర్శి ఎస్. స్వాతిరెడ్డి కోరారు. అనాథలు, యాచకులు తదితరులకోసం జైళ్లశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ‘ఆనంద నిలయం’ లో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. అనాథలు, వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. చట్టం ప్రకారం కూడా వీరికి హక్కులు ఉన్నాయన్నారు. ఆనందనిలయాన్ని నిర్వాహకులు పరిశుభ్రంగా ఉంచడం పట్ల స్వాతిరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో జైళ్లశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.

చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న స్వాతిరెడ్డి