తెలంగాణ

పాత జిల్లాల ప్రాతిపదికనే పదోన్నతులివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: పాత పది జిల్లాల ప్రాతిపదికనే పదోన్నతలు కల్పించాలని , కొత్త జిల్లాల ప్రకారం పదోన్నతులు కల్పించాలని చూస్తే అనేక న్యాయ వివాదాలు చెలరేగుతాయని తెలంగాణ టీచర్సు ఫెడరేషన్, తెలంగాణ డెమొక్రటిక్ టీచర్స ఫెడరేషన్ నేతలు ఇ రఘునందన్, కే రమణ, ఎస్ రాజేందర్, జీ సోమయ్యలు పేర్కొంటున్నారు. టీఆర్టీ నియామకాలతో పాటు సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోకుండా సర్వీసు ప్రొటక్షన్ ఇస్తూ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు విధిగా విద్యామంత్రి, కార్యదర్శి, డైరెక్టర్, డీఈఓలు వరకూ అంతా కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పాఠశాలలను సందర్శించి వౌలిక వసతుల కల్పనపై పరిశీలన చేయాలని అన్నారు. ప్రతి పాఠశాలను అందంగా తీర్చిదిద్దడంతో పాటు పిల్లలు, తల్లిదండ్రులు ఇష్టపడేలా స్కూళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక వసతులు పెంచితేనే తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని కల్పించగలుగుతామని అన్నారు.