తెలంగాణ

అద్భుత క్షేత్రం కానున్న యాదాద్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, జూలై 11: నల్లసరం కృష్ణ శిలలతో అద్భుత శిల్పకళా సంపదతో నిర్మితమవుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయం ప్రపంచ చరిత్రలో అద్భుత దివ్య క్షేత్రంగా నిలిచిపోతుందని దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన కుటుంబ సమేతంగా లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ ఈవో గీత, ధర్మకర్త బి.నరసింహమూర్తి, ప్రధానార్చకులు నంధీగల్ లక్ష్మినరసింహాచార్యులు, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చక పండిత బృందం ఆయనకు ఆశీర్వచనాలు పలుకగా, ఈవో గీత లడ్డూ ప్రసాదాలు అందించారు. అనంతరం ఇంద్రకరణ్‌రెడ్డి నూతన ఆలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూయాదాద్రి నూతన ఆలయ పునర్ నిర్మాణ పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయన్నారు. ఆలయంతో పాటు కొండపైన, దిగువన చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, కాటేజీలు, వీఐపీ, ప్రెసిడెన్షియల్ సూట్‌ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్నారు. నూతన ఆలయం ప్రారంభోత్సవం తేదీని సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారన్నారు. ఆయన వెంట స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
చిత్రం... మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఆశీర్వచనాలు అందిస్తున్న అర్చక బృందం