తెలంగాణ

దాహార్తిని తీర్చిన మిషన్ భగీరథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 11: రాష్ట్రంలో కరవు పరిస్థితుల్లో మిషన్ భగీరథ పథకం తాగునీటి సరఫరాకు లోటులేకుండా ప్రజల దాహార్తిని తీర్చిందని సీఎం కేసీఆర్ దార్శనికతకు, ఆయన ఆలోచనల సత్ఫలితాలకు నిదర్శనంగా నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరందర్‌రెడ్డిలతో కలిసి నల్లగొండ మున్సిపాల్టీకి రెండోపైప్‌లైన్ ద్వారా తాగునీటీని అందించేందుకు 116 కోట్లతో నిర్మించిన అమృత్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్యను శాశ్వతంగా దూరం చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ అదోగతి పాలవ్వగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు సాగు, తాగునీటికి అల్లాడిపోయారన్నారు. నేడు మిషన్ భగీరథతో జిల్లాలో కృష్ణా రక్షిత మంచినీటిని ఇంటింటికీ అందిస్తున్నామని, సాగర్ కాలువల కింద రెండు పంటలకు నీళ్లందించుకుంటున్నామన్నారు. కాళేశ్వరంతో గోదావరి జలాలు సైతం ఈ జిల్లాలో సాగు, తాగునీటి అవసరాలు తీర్చనున్నాయన్నారు. స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంతో ప్రజలు బతికేందుకు సీఎం కేసీఆర్ దార్శనికతో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని, ఆసరా పింఛన్ల పెంపుతో వృద్ధులు, వికలాంగులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే నల్లగొండ మున్సిపాల్టీకి రానున్నారని, జిల్లా కేంద్రంలో నల్లగొండ మెడికల్ కళాశాలను ఆయన ప్రారంభిస్తారన్నారు. మున్సిపల్ పార్కులను అభివృద్ధి చేయిస్తున్నామని, పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో సైతం రోడ్లు, మంచినీటి వసతుల విస్తరణ చేపట్టనున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో వెనుకబడిన నల్లగొండ మున్సిపాల్టీని సకల హంగులతో తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నరసింహారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేఖల భద్రాద్రి, జిల్లా మహిళాకోఆర్డినేటర్ మాలే శరణ్యారెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేవ్‌సింగ్, మేనేజర్ వెంకటేశ్వర్లు, నాయకులు చకిలం అనిల్‌కుమార్, గోలి అమరేందర్‌రెడ్డి, సుంకరి మల్లేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... అమృత్ పథకం పంప్‌హౌస్ స్విచ్ఛాన్ చేసి ప్రారంభిస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి