తెలంగాణ

కాలుష్య నివారణకు జిల్లాస్థాయి కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11 : సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ , బయోమెడికల్ వేస్ట్, నదుల కాలుష్యం, వాయుకాలుష్యం, ఇసుక గనులు తదితర అంశాలకు సంబంధించి జిల్లాస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. కాలుష్యానికి సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్ జారీ చేసిన ఆదేశాలపై జిల్లా కలెక్టర్లు, వైద్య శాఖ, గనులు, పంచాయతీరాజ్ అధికారులు తదితరులతో గురువారం సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాస్థాయిలో ఏర్పాటయ్యే కమిటీలు ప్రతినెలా సమావేశమై పక్కాగా ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. మూడు నెలలకోసారి సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌కు జీడిమెట్లలో ఏర్పాటు చేసిన ‘మాడల్ ప్లాంట్’ను రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కమిషనర్లకు చూపించాలని సీఎస్ కోరారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు డంపింగ్ యార్డులు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటిలో తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా ఉండేలా చైతన్యం చేయాల్సి ఉందని, చెత్తను సేకరించే వారిని కూడా చైతన్యం చేయాల్సి ఉందన్నారు. డింపింగ్ యార్డుల ఏర్పాటు, చెత్తసేకరణ, ప్రాసెసింగ్, చెత్తను వేరు చేయడం, డిస్పోజల్ తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లతో సమీక్షించారు.
ఈ అంశాలపై జిల్లాల్లోని కమిటీలు ప్రతినెలా సమావేశాలు నిర్వహించి, అధ్యయనం చేసి నివేదికలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) కు పంపించాలని సూచించారు.
బయోమెడికల్ వేస్ట్‌కు సంబంధించి రాష్ట్రంలో ఉన్న 11 ఇన్సులేటరీ యూనిట్స్‌ను ట్యాగ్ చేయాలని, రిజిస్టర్ కాని ఆసుపత్రులను రిజిస్టర్ అయ్యేలా చూడాలని అధికారులను సిఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో నదీ జలాలు ఏ ఏ ప్రాంతాల్లో కలుషితం అవుతున్నాయో గుర్తించి, కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, శుద్దిచేయని వ్యర్థాలు నదీజలాల్లో కలవకుండా చూడాలని సూచించారు. నగరీకరణ, పారిశ్రామికీకరణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని వాయుకాలుష్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని , అవసరమైన చోట్ల ఎయిర్ క్వాలిటీ స్టేషన్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలన్నారు. చెత్త సేకరణకు ఆటోలు, రిక్షాలు సమకూర్చుకోవాలని సూచించారు.
ఇసుక మైనింగ్ శాస్ర్తియ విధానంలో జరిగేలా చూడాలని జోషి ఆదేశించారు. అక్రమ మైనింగ్ జరగకుండా చూడాలన్నారు. అన్ని జిల్లాల్లో మైనింగ్ తర్వాత ఉపయోగంలోలేని క్వారీల వివరాలనుకలెక్టర్లకు పంపించాలని సీఎస్ సూచించారు. ఈ క్వారీలను ఘన వ్యర్థాల నిర్వహణకు వినియోగించుకునేలా చూడాల్సి ఉందన్నారు.
చిత్రం... వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎస్ జోషి