హైదరాబాద్

సహకార సంఘాల బలోపేతంతో రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలంటే సహకార సంఘాలను బలోపేతం చేయాలని కేరళ ఆర్ధిక మంత్రి డాక్టర్ థామస్ ఐజక్ పేర్కొన్నారు. ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యు, సుందరయ్య ట్రస్టు సంయుక్తంగా ‘రైతు సహకార వ్యవస్థ - పటిష్టత’ అంశంపై హైదరాబాద్‌లో గురువారం నాడు సదస్సును నిర్వహించాయి. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన థామస్ ఐజక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు వ్యవసాయ ఉత్పత్తి ధరలను ప్రభుత్వాలు తగ్గిస్తున్నాయని ప్రధానిగా మోదీ అధికారం చేపట్టిన తర్వాత వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలో పడిందని అన్నారు. దీనివల్ల రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఇతర వర్గాలు సంక్షోభంలో పడ్డారని అన్నారు. ఉత్పాదకత, రైతుల ఆదాయం పెరిగితేనే వ్యవసాయ రంగం వృద్ధి చెందుతుందని అయితే ప్రభుత్వ విధానాల కారణంగా ఆ రెండూ పడిపోతున్నాయని చెప్పారు. వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు క్రమేపీ తగ్గిపోతోందని వ్యవసాయ రంగం సంక్షోభానికి అదే కారణమని అన్నారు. రైతుల కనీస మద్దతు ధర, పంట రుణాలు సకాలంలో అందాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వాలు బలవంత భూ సేకరణ కూడా వ్యవసాయ రంగం తిరోగమనానికి కారణమని అన్నారు. సమాజంలో అనేక రుగ్మతులపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్న వామ పక్షాలు వారిని రాజకీయ చైతన్యం వైపు మళ్లించడంలో మరింత క్రియాశీలకంగా పనిచేయాలని అన్నారు. వ్యవసాయ సంక్షోభ నివారణలో సహకార సంఘాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. అయితే సహకార రంగం సమాజం మొత్తాన్ని మార్చలేదని పేర్కొన్నారు. మార్క్సు లెనిన్‌లు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారని గుర్తుచేశారు. వ్యవసాయ రంగంలో ప్రత్యామ్నాయ విధానం కోసం వామపక్షాలు క్రియాశీలకంగా వ్యవహరించాలని అన్నారు. రైతు ఉత్పత్తులకు కనీస మద్దతు ధర , భూపంపిణీ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.
భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో చిన్న సన్నకారు రైతుల ఆదాయాలు ఘోరంగా పడిపోతున్నాయని అన్నారు. ప్రతి రైతు రోజువారీ సమస్యలపై ఉద్యమించాలని అన్నారు. ప్రత్యామ్నాయ విధానాలతో కేరళ ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను చేపట్టిందని అవి ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. అందరికీ విద్య, ఇళ్ల స్థలాలు, ప్రజాపంపిణీ వ్యవస్థ బలోపేతం, అందరికీ ఆరోగ్యం, కార్మిక హక్కుల కల్పనలో ముందున్నామని అన్నారు. పోరాటాలతోనే కేరళ రైతులు హక్కులు సాధించుకున్నారని చెప్పారు. నాణ్యమైన విద్య, ఎక్కువ ఉపాధి అవకాశాలను ప్రజలు కోరుకుంటున్నారని ఆదిశగా కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కొత్త తరాన్ని వామపక్ష భావజాలానికి అనుగుణంగా మలుచుకోవడానికి వారి ఆలోచనలకు అనుగుణంగా కొన్ని సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. సేవారంగంలో చిన్న వృత్తిదారుల రక్షణ కోసం కృషి చేస్తూనే వారి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. పండ్ల తోటలు , ఎకో టూరిజం, తదితరాలతో రైతు ఆదాయం పెంచడానికి వ్యూహరచన చేస్తున్నట్టు చెప్పారు. కేరళ సహకార బ్యాంకులు లాభాలు ఆర్జిస్తుండటంతో ఎన్‌ఆర్‌ఐలు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారని ఇది శుభ పరిణామమని పేర్కొన్నారు.
ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావాలే మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక రైతాంగ సమస్యలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. మోదీ హయాంలోనే పంట కనీస మద్దతు ధరలు అతితక్కువగా ఉన్నాయని అన్నారు. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రైతులు, రైతు కూలీలు మేలు చేసేలా ఒక నిర్ణయం కూడా తీసుకోలేదని చెప్పారు. అంతేగాక, ఆదివాసీ రైతులు నుండి భూములను బలవంతంగా లాక్కునేందుకు అటవీ చట్టాలను సంస్కరించేందుకు మోదీ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని ఆరోదపించారు. కార్యక్రమంలో ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్‌మోల్లా, ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, ఎఐఏడబ్ల్యుయూ అధ్యక్ష, కార్యదర్శులు తిరువక్కరుసు, విజయరాఘవన్, ఆర్ధిక వేత్త ప్రొఫెసర్ వెంకటేశ్ ఆత్రేయ, మాజీ ఎంపీ జితేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ సంక్షోభం ప్రత్యామ్నాయ విధానాలు అనే పుస్తకాన్ని ఏఐకేఎస్ ప్రధానకార్యదర్శి రామచంద్రన్ పిళ్లై ఆవిష్కరించారు.
ఇందిరాజైసింగ్ ఇంటిపై దాడులు దారుణం
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఇందిరాజైసింగ్, ఆనంద్ గ్రోవర్ కార్యాలయాలపై సీబీఐ దాడులు అప్రజాస్వామికమని సదస్సు పేర్కొంది.