తెలంగాణ

ఇంటర్ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో మరింత జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ ఫలితాలను తొలుత 8వ తేదీన విడుదల చేయాలని భావించిన బోర్డు శనివారం (13) విడుదలకు సిద్ధమైనా, అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని బోర్డు అధికారులు పేర్కొన్నారు. మార్చిలోని ఫలితాల గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకటికి రెండు మార్లు పరిశీలించిన తర్వాతనే ఫలితాలను విడుదల చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఫలితాలు సిద్ధమైనా పునఃపరిశీలన జరుగుతోందని, ఫలితాల విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.